- Advertisement -
ఈ మధ్య పిల్లలు ఆన్ లైన్ గేమ్స్ కి బానిసలుగా మారిపోతున్నారు. దీంతో వారు ఎలా ప్రవర్తిస్తున్నారో అంతు చిక్కటం లేదు. ఈ గేమ్స్ ఆడవద్దని వారిస్తే మాత్రం ప్రాణాలను సైతం తీసేందుకు, తీసుకునేందుకు వెనుకాడటం లేదు. ఇలాంటి ఘటన విశాఖలో జరిగింది.
ఆన్ లైన్ గేమ్స్ కి బానిసగా మారిన కొడుకును చూసి రోజు ఆ తల్లి చలించిపోయేది. ఇకా ఆ గేమ్ ఆడొద్దని వారించే సరికి కోపోద్రిక్తుడైన కొడుకు తల్లిని బలంగా కొట్టి చంపేశాడు. ఈ ఘటన మల్కాపురంలో జరిగిందని పోలీసులు తెలిపారు.
స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతిరాలి భర్త ఇండియన్ నేవి అధికారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.