తిరుపతిలో భారీ చోరీ జరిగింది. దాదాపు 1.48 కిలో బంగారాన్ని దొంగలు అపహరించారు. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని CPR విల్లాలో ఈ ఘటన జరిగింది. వరుసగా నాలుగు ఇళ్లలో చేతివాటం ప్రదర్శించారు చోరి గ్యాంగ్.
సోలార్ ఫెన్సింగ్ ను కట్ చేసి, ఆపై విల్లా ఇళ్లలోకి ప్రవేశించారు దుండగులు. 80,81,82,83 వరుస ఇండ్లను బద్దలు కొట్టేశారు. 81 లో మేఘనాథ రెడ్డి ఇంటిలో పైన నిద్రిస్తుండగా కింద అంతస్తులో1 కేజీ బంగారాన్ని దోచుకెళ్లారు.
82లో దొర ప్లాస్టిక్ కేశవుల నాయుడు అల్లుడు ఇంటిలో 48 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగలించేశారు. 80,83 ఇండ్లను గెస్ట్ హౌస్ గా వినియోగించుకుంటున్నారు ఇంటి యజమానులు. ఈ ఘటన శనివారం రాత్రే సమయంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు.
సంఘటన స్థలానికి క్రైమ్ పోలీసులు చేరుకొని విచారణ చేస్తున్నారు. క్లూస్ టీం చేరుకుని ఆధారాలు సేకరిస్తుంది.బాధితులు ఫిర్యాదు మేరకు కేసు క్రైమ్ పోలీసులు నమోదు చేశారు.