మహరాష్ట్రలో ఘోర ప్రమాదం, అదుపుతప్పి లోయలో పడ్డ బస్సు
మహరాష్ట్రలోని నాసిక్ – గుజరాత్ జాతీయ రహదారిపై ఘోర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం వేకువజామున 4.30 గంటలకు ప్రయాణికులతో వెళ్తున్న ఓ లగ్జరీ బస్సు అదుపుతప్పి 200 అడుగుల లోతు లోయలో పడింది. ఈ ఘటనలో 7 మంది మృతి చెందారని తెలిసింది.
మరో 17 మందికి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన డాంగ్ జిల్లాలోని సపుతరా హిల్ స్టేషన్ పరిధిలో జరిగింది. వీరంతా నాసిక్ లోని పుణ్యక్షేత్రాను సందర్శించేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని క్షతగాత్రుల్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.ఆదివారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు జిల్లా డిప్యూటీ ఎస్పీ ఎస్జీ పాటిల్ తెలిపారు.
ఆదివారం తెల్లవారుజామున రోడ్డును పూర్తిగా మంచు కప్పేయటంతో దారి సరిగ్గా కనిపించక బస్సు అదుపుతప్పి 2 వందల అడుగుల లోతులో పడిందన్నారు. ఈ ప్రమాదంలో 7 మంది ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారన్నారు.
ఈ బస్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.