Sunday, October 6, 2024
Homeహెల్త్Pine seeds: పైన్ గింజలతో బరువు తగ్గచ్చు

Pine seeds: పైన్ గింజలతో బరువు తగ్గచ్చు

పైన్ గింజల గురించి విన్నారా? వీటినే చిల్గోజా గింజలు అని కూడా అంటారు. వీటిల్లో ఎన్నో పోషకవిలువలు ఉన్నాయి. పైన్ గింజలు గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. అంతేకాదు శరీరంలో రోగనిరోధకశక్తిని కూడా ఇవి పెంచుతాయి. అధికబరువు ఉన్నవారు బరువు తగ్గడానికి తీసుకునే డైట్ లో పైన్ గింజలు కీలకంగా పనిచేస్తాయి. మధుమేహాన్ని నియంత్రణలో పెట్టడంలో కూడా పైన్ గింజలు బాగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తారు. వీటిల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు అంటే మోనోఅన్ శాచ్యురేటెడ్, పాలీ అన్ శాచ్యురేటెడ్ కొవ్వులు సమ్రుద్ధిగా ఉంటాయి. అంతేకాదు ఈ గింజల్లో కాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. మెగ్నీషియం, విటమిన్ ఇ, పొటాషియం, పాలీఫైనాల్స్ వంటివి వీటిల్లో ఉండడం వల్ల గుండె సమస్యలు తలెత్తవు. మాంగనీసు, కాల్షియం, జింకు, ఐరన్ కూడా ఈ గింజల్లో ఉన్నాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

- Advertisement -

శరీరంలో తెల్లరక్తకణాలను పెంచడం ద్వారా రోగనిరోధక వ్యవస్థ పనితీరును ఇవి మెరుగుపరుస్తాయి.అంతేకాదు పైన్ గింజల్లోని పాలిఫెనాల్స్ లో కాన్సర్ నిరోధక సామర్థ్యం దాగుంది. ఒక అధ్యయనంలో పైన్ గింజల్లోని పాలిఫెనాల్స్ ఊపిరితిత్తులు, ఇతర కాన్సర్లను తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తాయని వెల్లడైంది. ఈ నట్స్ లోని సెలీనియం కూడా కాన్సర్ ప్రమాదాన్ని అరికట్టడంలో సహాయపడుతుంది. పైన్ గింజల్లో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి వ్రుద్ధాప్య కారకాలను నియంత్రించడంలో కీలకంగా వ్యవహరిస్తాయని సౌందర్య నిపుణులు చెప్తున్నారు. చర్మాన్ని యవ్వనంగా కనిపించేలా ఇవి చేస్తాయంటున్నారు.

పైన్ గింజల వినియోగం వల్ల జన్యుస్థాయిలో నట్స్ అలర్జీని తగ్గించడంలో కూడా పైన్ గింజలు పనిచేస్తాయంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే దీనిపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. బాదం, జీడిపప్పులు వంటి డ్రైఫ్రూట్ల కన్నా కూడా పైన్ గింజలతో ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని వైద్యనిపుణులు చెప్తున్నారు. వీటిని తినడం వల్ల శరీరానికి బలం వస్తుంది. అంతేకాదు ఎముకలు ద్రుఢంగా తయారవుతాయి. దగ్గు, ఉబ్బసం సమస్యలను ఇవి తగ్గిస్తాయి. ఐదు నుంచి పది గ్రాముల పైన్ గింజల పొడిలో తేనె కలిపి రోజూ తింటే దగ్గు, ఉబ్బసాల నుంచి ఉపశమనం లభిస్తుందని కూడా చెప్తున్నారు.

శరీరం బలహీనంగా ఉన్నట్టు అనిపిస్తే రోజుకు మూడు పైన్ గింజలను తింటే మంచిదని డైటీషియన్లు సూచిస్తున్నారు. పైన్ గింజలు తినడం వల్ల తొందరగా ఆకలి వేయదు. అందుకే వెయిట్ లాస్ లో ఉన్నవాళ్లు వీటిని డైట్ లో తప్పనిసరిగా తీసుకుంటారు. పైన్ గింజల్లో ల్యూటిన్ అని పిలిచే కెరొటినాయుడ్లు అధికంగా ఉంటాయి. వయసు వల్ల తలెత్తే కంటి క్షీణతను తగ్గించడంలో ల్యూటిన్ బాగా పనిచేస్తుంది. అలాగే పైన్ గింజల్లో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల వయసు ప్రభావం శరీరం మీద తొందరగా కనపడదు. చర్మం త్వరగా ముడతలు పడదు. అలాగే పైన్ గింజలు తినడం వల్ల పేగులు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి.

కీళ్లనొప్పుల నుంచి కూడా ఇవి ఉపశమనం ఇస్తాయి. ఈ గింజలను పిల్లలకు కూడా పెట్టొచ్చు. వీటిని చలికాలంలో తింటే శరీరంలో వేడి పెరుగుతుంది కూడా. రకరకాల వైరస్ లపై పోరాడే రోగనిరోధకశక్తి ఈ గింజల్లో ఉంది. ఇవి రక్తంలోని చెడు కొలస్ట్రాల్ ని తగ్గించడంతో పాటు ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే పైన్ గింజల వల్ల పొందే లాభాలు ఎన్నో. అయితే వైద్యుని సలహాకననుగుణంగానే పైన్ గింజలను డైట్ లో తీసుకోవాలి. అలాగే వీటిని అతిగా తిన్నా ఆరోగ్యానికి మంచిది కాదని గుర్తుంచుకోవాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News