Wednesday, April 16, 2025
Homeపాలిటిక్స్Fess poru postpone:వైసీసీ 'ఫీజుపోరు' వాయిదా

Fess poru postpone:వైసీసీ ‘ఫీజుపోరు’ వాయిదా

విద్యార్థులకు వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ (Fees Reimbursement) ఇవ్వాలని కోరుతూ, ఈనెల 5న తలపెట్టిన ‘ఫీజు పోరు’ కార్యక్రమాన్ని మార్చి 12వ తేదీకి వాయిదా వేస్తున్నామని వైసీపీ అధిష్టానం నిర్ణయించింది.

ఫిబ్రవరి 5న రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన ఫీజుపోరు నిరసన కార్యక్రమాలు ఈ మేరకు వాయిదా వేస్తున్నామని తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ ప్రకటనలో తెలిపింది.

ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున, మా ‘ఫీజు పోరు’ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరినా, ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిపింది. దీంతో ఆ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత, మార్చి 12వ తేదీన ‘ఫీజు పోరు’ నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు.


https://twitter.com/YSRCParty/status/1886421741775560739?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1886421741775560739%7Ctwgr%5E33e0948320a24e0ca91dbf19c3b7c01df2635406%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.samayam.com%2Fandhra-pradesh%2Fnews%2Fysrcp-postponed-feeju-poru-from-february-5-to-march-12-due-to-mlc-election-code%2Farticleshow%2F117891494.cms
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News