తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) ఐటీ అధికారుల ఎదుట హాజరయ్యారు. వ్యాపారాలకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని ఐటీ అధికారులు(IT Raids) నోటీసులు ఇచ్చారు. దీంతో డాక్యుమెంట్లు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను ఆయన ఐటీ అధికారులకు అందించినట్లు సమాచారం. ఇటీవల దిల్ రాజు నివాసం, కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. ఆర్థిక లావాదేవీలు, పన్ను చెల్లింపులకు సంబంధించిన పలు కీలక పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే బ్యాంకు లాకర్‌లను కూడా తనిఖీ చేశారు.
మరోవైపు హైదరాబాద్‌లోని సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లోనూ సోదాలు జరిగిన విషయం విధితమే. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్(Sukumar), మైత్రీ మూవీస్, మ్యాంగో మీడియా, వృద్ధి సినిమాస్, ఏషియన్ సినిమాస్, ఇతర నిర్మాతల కార్యాలయాల్లోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. నిర్మాణ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపు మధ్య తేడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.