ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి నిధులపై వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. తాజాగా కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరారు. డిఫెన్స్ రంగం పరికరాల తయారీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు వస్తున్న నేపథ్యంలో కొన్ని యూనిట్లు ఏపీకి వచ్చేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రధాని మోదీ వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఏపీని అభివృద్ధి బాటలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని లోకేశ్ వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం తరపున తమ వంతు సహాయ, సహకారాలు అందిస్తామని రాజ్నాథ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, సీఎం రమేశ్, కేశినేని చిన్ని పాల్గొన్నారు.