Thursday, February 6, 2025
Homeనేరాలు-ఘోరాలుChicken: అంతు చిక్కని వైరస్.. 40 లక్షలకు పైగా కోళ్ల మృతి

Chicken: అంతు చిక్కని వైరస్.. 40 లక్షలకు పైగా కోళ్ల మృతి

తెలుగు రాష్ట్రాల్లోని పౌల్ట్రీ పరిశ్రమను (poultry industry)అంతు చిక్కని వైరస్ కలవరపెడుతుంది. ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లాలను వణికిస్తోంది. ఇప్పుడు ఆరోగ్యంగా కనిపించిన కోడి నిమిషాల్లోనే మృత్యువాత పడుతుండటం పౌల్ట్రీ నిర్వాహకులను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. సాధారణ మరణాలకు భిన్నంగా వేలాది కోళ్లు చనిపోతుండటం నిర్వాహుకులను ఆందోళనకు గురిచేస్తోంది.

గుట్ట గుట్టులుగా మృతి చెందిన కోళ్లు
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పౌల్ట్రీ ఫారాల వద్ద చనిపోయిన కోళ్లు గుట్టలు గుట్టలుగా దర్శనమిస్తున్నాయి. ఒక్కొ ఫారంలో రోజుకు సుమారు 10 వేల కోళ్లు చనిపోతున్నాయని నిర్వాహుకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ కోళ్ల మృతికి కారణం ఏంటన్నది గుర్తించలేకపోతున్నామని యజమానులు వాపోతున్నారు.

ఎగ్ ఎగుమతులు డీలా
ఈ అంతు చిక్కని కోళ్ల మృతితో కోడిగుడ్ల ఎగుమతులు భారీగా తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి నుంచి పశ్చిమ బెంగాల్, అస్సా రాష్ట్రాలకు రోజు 40కి పైగా లారీల్లో కోడిగుడ్లు ఎగుమతి అయ్యేవేన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య ప్రస్తుతం 25కు పడిపోయిందన్నారు. మరికొన్ని రోజులు పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆ సంఖ్య సింగిల్ డిజిట్‌కు పడిపోతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోళ్ల మరణాలు ఇలాగే కొనసాగితే భారీ నష్టాలు తప్పవని పౌల్ట్రీ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

40 లక్షలకు పైగా కోళ్ల మృతి
మాములుగా తీవ్ర అనారోగ్య సమస్యలు, తదితర కారణాలతో పౌల్ట్రీలోని కోళ్ల సంఖ్యలో రోజుకు 0.05 శాతం లోపు కోళ్లు చనిపోతుంటాయి ఇది సర్వసాధారణం. కానీ లక్ష కోళ్లు ఉన్న పౌల్ట్రీలో రోజుకు 20 నుంచి 50 వరకు కోళ్లు చనిపోతుంటే లెక్కలోకి తీసుకోరు. ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని అంటున్నారు. ఒక్క ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే గడిచిన 15 రోజుల్లో 40 లక్షల కోళ్లు చనిపోయాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చంటున్నారు. ఈ కోళ్ల మరణాలకు కారణమైన వైరస్‌ను గుర్తించి..దాని నిర్మూలనకు సహకరించాలని ప్రభుత్వాన్నికోరుతున్నారు పౌల్ట్రీ నిర్వాహుకులు.

ఉన్న కోళ్లను తక్కువ ధరకే అమ్మకాలు
డిసెంబర్, జనవరి నెలల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువై కోళ్లకు ఊపిరితిత్తుల సంబంధిత వైరస్‌లు వ్యాపిస్తుంటాయి. అయితే శీతాకాలంలో వచ్చే వ్యాధులకు భిన్నంగా ఈ వైరస్‌ లక్షణాలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. తెల్లారేసరికి ఎన్ని కోళ్లు ఉంటాయో తెలియని పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం ఒక్క కోడికి వైరస్‌ సోకిందంటే చాలు సాయంత్రానికి ఆ షెడ్డులో ఉన్న వేలాది కోళ్లు ప్రాణాలు కోల్పోతున్నాయి. దీంతో వైరస్ వచ్చి చనిపోతాయేమో అనే భయంతో బతికి ఉన్న కోళ్లను వచ్చిన ధరకు అమ్మేస్తున్నామని చెబుతున్నారు.

శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించిన అధికారులు
మరోవైపు కోళ్ల అంతుచిక్కని మరణాలకు కారణాలేంటో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పౌల్ట్రీ పార్మ్స్‌లో ఇప్పటికే శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కి పంపామని అధికారులు చెబుతున్నారు. ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కోళ్లకు సోకుతున్న వ్యాధి ఏంటో తెలుస్తుందంటున్నారు. అయితే మరిన్ని కోళ్లకు వైరస్ సోకకుండా రైతులు చనిపోయిన కోళ్లను బహిరంగ ప్రదేశంలో పడేయకుండా పాతిపెట్టాలని సూచిస్తున్నారు.

వైరస్ ప్రభావం తగ్గేదేందుకు మందులు
అధికారుల సూచనలతో ఇప్పటికే కోళ్లపై వైరస్ ప్రభావం తగ్గేందుకు మందులు ఇస్తున్నారు. ఇక కొల్లేరు ప్రొంతానికి ఈ సారి అధిక సంఖ్యలో వలస పక్షులు రావడం కూడా వైరస్ వ్యాప్తికి కారణమై ఉండొచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News