Sunday, November 24, 2024
Homeనేరాలు-ఘోరాలుBengaluru : శృంగారం చేస్తూ మరణించిన వ్యక్తి.. కారణం ఏంటంటే..

Bengaluru : శృంగారం చేస్తూ మరణించిన వ్యక్తి.. కారణం ఏంటంటే..

శృంగారం చేస్తూ .. ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించిన ఘటన బెంగళూరులో వారంరోజుల తర్వాత వెలుగుచూసింది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జేపీ నగర్ పుట్టెనహళ్లికి చెందిన బాల సుబ్రమణియన్ (67) వ్యాపారవేత్త. కొడుకు, కోడలు, మనువడితో కలిసి ఉంటున్నాడు. వయసు పెరిగినా.. అతనిలో కోరిక చావలేదు. తన ఇంట్లో పనిచేసే 35 ఏళ్ల మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. తరచూ బాల సుబ్రమణియన్ ఆమె ఇంటికి వెళ్లి వస్తుండేవాడు. సందు దొరికినప్పుడల్లా ఇద్దరూ ఎంజాయ్ చేసేవారు.

- Advertisement -

నవంబర్ 16న బాల సుబ్రమణియన్ తన మనవడిని బ్యాడ్మింటన్ కోచింగ్ వద్ద దింపేందుకు ఇంటి నుండి బయల్దేరాడు. సాయంత్రం 4.55 గంటల సమయంలో కోడలికి ఫోన్ చేసి ఆలస్యంగా వస్తానని చెప్పాడు. అనంతరం ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. ఆమెతో శృంగారంలో పాల్గొంటుండగానే గుండెపోటుతో మరణించాడు. దాంతో కంగారు పడిన ఆమె.. తన సోదరుడు, భర్తకు సమాచారమిచ్చింది. అక్రమ సంబంధం గురించి బయట తెలిస్తే పరువు పోతుందని భావించిన వారంతా..మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచుల్లో కుక్కి.. ఒక బెడ్ షీట్ చుట్టి నిర్మానుష్య ప్రాంతంలో పడేశారు.

ఎంత పొద్దుబోయినా.. తండ్రి ఇంటికి రాకపోయే సరికి కొడుకు సుబ్రమణ్య నగర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఒకరోజు తర్వాత జేపీ నగర్లోని నిర్మానుష్య ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని మృతదేహం లభించింది. బాల సుబ్రమణియన్ కుటుంబ సభ్యులు మృతదేహాన్ని గుర్తించడంతో.. పోస్టుమార్టమ్ కు తరలించారు. దర్యాప్తులో భాగంగా పనిమనిషిని విచారించడంతో అసలు విషయం తెలిసింది. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. పోస్టుమార్టమ్ రిపోర్ట్ వచ్చాకే అతని మరణానికి గల పూర్తి కారణాలు తెలుస్తాయన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News