Saturday, July 27, 2024
Homeచిత్ర ప్రభKantara : కాంతార ఇప్పుడు ఆ భాషలో కూడా..

Kantara : కాంతార ఇప్పుడు ఆ భాషలో కూడా..

- Advertisement -

Kantara : కన్నడ సినిమా కాంతార దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. రిషబ్ శెట్టి, సప్తమి గౌడ జంటగా రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ సినిమా కాంతార కర్ణాటకలో చిన్న సినిమాగా రిలీజయి ఆ తర్వాత దేశమంతటా హిట్ కొట్టింది. ఇప్పటికే ఈ సినిమా 400 కోట్లని కలెక్ట్ చేసింది.

ఇటీవలే 50 రోజులు పూర్తి చేసుకున్న కాంతార అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో కూడా వచ్చింది. ఇప్పటికే దేశంలోని పలు భాషల్లో రిలీజయిన కాంతార ఇప్పుడు మరో భాషలో రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతుంది.

కర్ణాటకలోనే కన్నడతో పాటు తుళు భాష కూడా ఉందన్న సంగతి తెలిసిందే. కాంతార సినిమా ఇప్పుడు తుళు భాషలో రిలీజ్ అవ్వనుంది. డిసెంబర్ 2 నుంచి కాంతార సినిమా తుళు భాషలో రిలీజ్ అవ్వనున్నట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అలాగే నవంబర్ 25 నుండి ఓవర్సీస్ లో మరిన్ని దేశాల్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News