Friday, February 7, 2025
Homeహెల్త్Deworming: చిన్న పిల్లల్లో నులిపురుగుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!!

Deworming: చిన్న పిల్లల్లో నులిపురుగుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!!

చిన్నపిల్లల నుంచి 19 ఏళ్ల వయస్సు వారి వరకు ఈ నులిపురుగులతో (Deworming) ఇబ్బంది పడుతుంటారు. తరచు అనారోగ్యానికి గురి అవుతూ ఉంటారు. వీటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఆల్బెండజోల్ మాత్రలు వాడాల్సి ఉంటుందని వైద్యులు తెలుపుతున్నారు. మరి ఆ జాగ్రత్తలేంటో తెలుసుకుందాం పదండి.

- Advertisement -

పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని వైద్యులు తెలిపారు. పిల్లల చేతివేళ్ల గోర్లను ఎప్పటికప్పుడు కత్తిరించాలన్నారు. వాటిలో మట్టి చేరకుండా చూసుకోవాలన్నారు.పరిశుభ్రమైన నీటినే తాగాలి. తినే ఆహారం కలుషితం కాకుండా మూతలు పెట్టాలన్నారు.

సాధ్యమైనంత వరకు వేడిగా ఉన్న పదార్థాలే తీసుకోవాలన్నారు. ఈగలు, దోమలు ఆహారంపై వాలకుండా జాగ్రత్తపడాలన్నారు. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను శుభ్రమైన నీటితో కడిగిన తర్వాతే వాడాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జనను మానేసి మరుగు దొడ్ల వాడకాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. మల విసర్జన తర్వాత చేతులను సబ్బులతో బాగా కడుక్కోవాలన్నారు. పిల్లలు ఆటల సమయంలో, బయట తిరిగేటప్పుడు బూట్లు లేదా చెప్పులు ధరించాలి.

ప్రయోజనాలు
ఆల్బెండజోల్ మాత్రలు(Albendazole tablets)వాడటం వల్ల కడుపులోని నులిపురుగులు తగ్గిపోతాయి. వీటిని నిర్మూలించడం వల్ల రక్తహీనతను నియంత్రణలోకి వస్తుంది. పోషకాహార అవసరాన్ని మెరుగుపరుస్తుంది. వ్యాధి నిరోధకత మెరుగవుతుంది. చదువుపై ఏకాగ్రత, నేర్చుకోగల సామర్థ్యం పెరుగుతుంది. పని సామర్థ్యం కూడా పెరుగుతుంది.

చేయవలసినవి
ఆల్బెండజోల్ మాత్రలు మధ్యాహ్నం భోజనం తర్వాత వేసుకోవాలి. 1-2 సంవత్సరాల లోపు పిల్లలు 200 మిల్లీ గ్రాముల మాత్రను పగలగొట్టి స్పూన్ నీటిలో కలిపి తాగించాలి. 3-19 సంవత్సరాల పిల్లలు 400 మిల్లీ గ్రాముల మాత్రను బాగా నమలి తగినంత నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ORSS ప్యాకెట్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ మాత్రలను పిల్లలకు అంగన్వాడి, పాఠశాలలు, కళాశాలలో ఆశ కార్యకర్త, టీచర్లు, అధ్యాపకులు వైద్య సిబ్బంది పర్యవేక్షణలో వేయించాలన్నారు.


ఆల్బెండజోల్ మాత్రలపై అంగన్వాడి, స్కూలు, కళాశాలలో పిల్లలకు ‘ఆరోగ్య విద్య’ ద్వారా అవగాహన కల్పించాలన్నారు. ప్రైవేట్ స్కూళ్లలో విద్యార్థుల యొక్క డైరీలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పొందుపరిచి, తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు.ఈ మాత్రను ప్రతి ఆరు నెలలకోసారి వేసుకోవడం వల్ల నులిపురుగులు తగ్గిపోతాయన్నారు.

చేయకూడనివి
అనారోగ్య కారణాలు ఉన్న పిల్లలకు ఈ మాత్రను వేయరాదు. ఈ మాత్రను మింగాలని విద్యార్థులకు సూచించరాదు.(ఈ మాత్రం మింగకూడదు నమిలాలి). తడి మరియు ఎండ ప్రాంతాలలో ఈ మాత్రలు ఉంచరాదు. ఈ మాత్రను పిల్లల చేతికిచ్చి ఇంటికి పంపరాదన్నారు.

ఫిబ్రవరి 10వ తేదీ “జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ప్రతి పాఠశాల నందు అవగాహన కార్యక్రమాలు, ఆల్బెండజోల్ మాత్రలు వేసేందుకు చర్యలు చేపట్టింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News