Saturday, February 8, 2025
Homeచిత్ర ప్రభKarthika Deepam February 8th Episode: శౌర్య ఆపరేషన్‌కు కావేరి డబ్బులు ఇచ్చిన విషయం తెలుసుకున్న...

Karthika Deepam February 8th Episode: శౌర్య ఆపరేషన్‌కు కావేరి డబ్బులు ఇచ్చిన విషయం తెలుసుకున్న శ్రీధర్..

ఈరోజు ఎపిసోడ్‌లో కావేరిని హోమానికి దీప పిలిస్తే తప్పకుండా వస్తాను అని చెప్తుంది. ఆతర్వాత శ్రీధర్ కావేరిని ఎవరో వచ్చినట్టు ఉన్నారు ఏంటి అంటే కావాల్సిన వాళ్లు వచ్చారు అంటే శ్రీధర్ గుచ్చి గుచ్చి అడుగుతాడు ఎవరు, ఏంటి అంటే కావేరి ఏదో సమాధానం ఇస్తుంది. వచ్చింది దాప అని చెప్పకుండా ఈ డొంకతిరుగుడు ఏంటి అంటుంది.

- Advertisement -

మరోవైపు జ్యోత్స్న శౌర్య ఆపరేషన్‌కు ఎవరు సాయం చేసారో తెలుసుకోవడానికి కార్తీక్, దీపలకు తెలిసిన వాళ్ల పేర్లు ఓ లిస్ట్ రాసి ఆలోచిస్తుంది. అలా అందరి పేర్లు గురించి ఆలోచిస్తూ కావేరి పేరు వచ్చే సరికి ఆవిడ ఇవ్వదు అని జ్యోత్స్న అంటుంది. శ్రీధర్ ఇచ్చాడేమో అని మామ గురించి పారిజాతంతో మాట్లాడుతుంది. మరోవైపు హోమం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు. దీప ఏది అని అడిగితే ఈలోపే అక్కడికి వస్తుంది. ఎవరెవరిని పిలిచావు అని కార్తీక్ అడిగితే కావాల్సిన వాళ్లని పిలిచాను అంటుంది దీప. కావాల్సిన వాళ్లు బయటవాళ్లు, బయటవాళ్లు కావాల్సిన వాళ్లు అయ్యారు అని కాంచన బాధపడుతుంటే దీప మీరు బాధపడకండి కావాల్సిన వాళ్లు వస్తారు అంటుంది.

మరోవైపు శౌర్య ఆపరేషన్ గురించి నాకెందుకు నువ్వు చెప్పలేదని స్వప్న కాశీ మీద అరుస్తుంది. కార్తీక్ బావ చెప్పద్దు అన్నాడు అని కాశీ చెప్తాడు. డబ్బుల గురించి మాట్లాడుకుంటుంటే జ్యోత్స్న పేరు వస్తుంది. అలా జ్యోత్స్న పేరు వినగానే దాసు కోమా నుంచి లేచి నిజం చెప్పాలి అంటూ బయటికి వస్తాడు. వెంటనే ఎక్కడికి నాన్న అని కాశీ ఆపుతాడు. నన్ను కొట్టారు అది మంచిది కాదు అన్నయ్యతో చెప్పాలి అంటూ ఏదోదే చెప్తుంటే కాశీకి అర్థం కాదు. కాశీ అడుగుతూ ఉంటే స్వప్న ఆపుతుంది. దాసుని లోపల పడుకోపెట్టి కాశీ స్వప్న బయటికి వచ్చి దాసు కండీషన్ కోసం మాట్లాడుకుంటారు.

మరోవైపు శ్రీధర్ ఇంట్లో కూర్చుని మందు తాగుతూ దీప నా పెళ్లాన్ని హోమానికి పిలిస్తే ఆ విషయం నా దగ్గర ఎందుకు దాచింది అని ఆలోచిస్తాడు. అప్పుడే శ్రీధర్‌కు జ్యోత్స్న ఫోన్ చేసి శౌర్య ఆపరేషన్‌కు డబ్బులు మీరే ఇచ్చారా అని అడుగుతుంది. శ్రీధర్ నేను ఎవరు చేశారో నాకు తెలియదు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత శ్రీధర్ పెళ్లాం మీద డౌట్‌తో ఇంట్లో చెక్ చేసి ఆ తర్వాత బ్యాంకుకు ఫోన్ చేసి కావేరి పేరు మీద ఉన్నఎఫ్‌డీల గురించి తెలుసుకుంటాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News