మహారాష్ట్రను గులియన్ బారే సిండ్రోమ్ (Guillain Barre Syndrome) వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాది బారినపడి ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా తెలంగాణలో GBS వ్యాధి కలకలం సృష్టిస్తోంది. ఈ వైరస్ బారిన పడి ఇప్పుడు తెలంగాణలో ఓ మహిళ మృతి చెందారు.
గలియన్ బార్ సిండ్రోమ్(GBS)తో బాధ పడుతున్న సిద్దిపేట సమీపంలోని సీతారాంపల్లికి చెందిన ఓ వివాహిత చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గత నెల జనవరి 31న ఈ కేసు నమోదైనట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనతో కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇదే మెుదటి జీబీఎస్ మరణం కావటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సిద్దిపేట జిల్లాకు చెందిన సదరు మహిళ గులియన్ బారీ సిండ్రోమ్ అనే నరాల వ్యాధి బారిన పడి గత పది రోజులుగా హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో ఆందోళన మెుదలైంది.
లక్షణాలుంటే జాగ్రత్తలు తప్పనిసరి
జీబీఎస్ వ్యాధి జీబీఎస్ వ్యాధి సోకిన వారిలో శరీరమంతా తిమ్మిరిగా అనిపిస్తుందని వైద్యులు తెలుపుతున్నారు. జ్వరం తీవ్రత అధికంగా ఉండటం. వాంతులు వంటి లక్షణాలు ప్రాథమిక దశలో కనిపిస్తాయని చెబుతున్నారు. వీటితో పాటుగా కడుపు నొప్పిగా ఉండటం వంటి లక్షణాలు కూడా ఉంటాయన్నారు.
ఉన్నట్టుండి నీరసంగా అనిపించడం, కండరాలు సచ్చుగా మారడం వంటివి గులియన్ బారే సిండ్రోమ్ లక్షణాలుగా చెప్పుకోవచ్చున్నారు. ఈ వ్యాధి నీటి ద్వారా, కలుషిత ఆహారం తీసుకోవడం ద్వారా బ్యాక్టీరియా రూపంలో సోకుతుందన్నారు. ఇలాంటి లక్షణాలుంటే వెంటేనే వైద్యులు సంప్రదించి చికిత్స తీసుకోవాలని కోరుతున్నారు.