- Advertisement -
కడప జిల్లా బి. కోడూరు మండలంలో విషాదం జరిగింది. గుంతపల్లి గ్రామానికి చెందిన కూరాకు జయరాం రెడ్డి (48) గురమ్మ (60) విద్యుత్ షాక్(Electric shock)తో మృతి చెందారు. తల్లి,కొడుకు మృత్యువాతపడటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
గుంతపల్లి గ్రామ సమీపాన ఉన్న తెలుగు గంగకాలువలో మోటర్ పెట్టి పొలానికి నీరు అందిస్తున్నారు. మోటరు ఆడకపోవటంతో చిన్నపాటి మరమ్మత్తులు చేస్తున్న సమయంలో జయరాం రెడ్డికి విద్యుత్ షాక్ కొట్టి గిలగిలా కొట్టుకుంటున్నాడు. అది చూసిన తల్లి గురమ్మ కొడుకు జయరాంకి ఏమైందోనని కంగారులో పట్టుకోవటంతో ఆమె కూడా విద్యుత్ షాకుకి గురై చనిపోయింది.
వీరి ఇరువురు చనిపోవడంతో గుంతపల్లి గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. బి కోడూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.