తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)తో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ(Manda Krishna Madiga) భేటీ అయ్యారు. జస్టిస్ షమీమ్ అక్తర్ నివేదికలోని లోపాలను సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్ల అంశంపై చర్చిస్తున్నారు.
కాగా సోమవారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి మందకృష్ణ మాదిగ బహిరంగ లేఖ రాశారు. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. అయితే జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ నివేదికలో కొన్న లోపాలు ఉన్నాయని తెలిపారు. ఈ నివేదిక ప్రకారం కొన్ని దళిత కులాల హక్కులు, వాటా, అస్తిత్వం ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. ఈ అంశాలపై కొన్ని వినతులు, సూచనలు తెలియజేయాల్సిన అవసరం ఉందని.. సాధ్యమైనంత త్వరగా మిమ్మల్ని కలిసి కూలంకషంగా చర్చించేందుకు సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఇవాళ మందకృష్ణ కలిసేందుకు సీఎం రేవంత్ అవకాశమిచ్చారు.