Tuesday, February 11, 2025
HomeఆటSouth Africa: ఇదేందయ్యా.. సౌతాఫ్రికా-న్యూజిలాండ్ మ్యాచ్‌లో విచిత్ర ఘటన

South Africa: ఇదేందయ్యా.. సౌతాఫ్రికా-న్యూజిలాండ్ మ్యాచ్‌లో విచిత్ర ఘటన

పాకిస్థాన్ వేదికగా న్యూజిలాండ్, సౌతాఫ్రికా, పాక్ మధ్య ముక్కోణపు వ‌న్డే సిరీస్ జ‌రుగుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా (NZ vs SA) జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. దక్షిణాఫ్రికా(South Africa) స్టార్ ప్లేయర్లు ఇటీవల ముగిసిన సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడటం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో ఈ ట్రై సిరీస్‌కు జూనియర్ జట్టును ఆ దేశ బోర్డు ఎంపిక చేసింది. అది కూడా కేవలం 12 మంది సభ్యులతో కూడిన జ‌ట్టును మాత్రమే సెలెక్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఆ జట్టుకు ఆటగాళ్ల కొరత ఏర్పడింది.

- Advertisement -

న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా బౌలింగ్ చేసేటప్పుడు ఇద్ద‌రు ఆటగాళ్లు ఎమర్జెన్సీ కార‌ణంగా మైదానం వీడారు. దాంతో ఒక ఫీల్డ‌ర్ త‌క్కువ కావ‌డంతో చేసేదేమీలేక‌ ఆ జ‌ట్టు ఫీల్డింగ్ కోచ్ వాండిలే గ్వావు స‌బ్‌స్టిట్యూట్ ఫీల్డ‌ర్‌గా బ‌రిలోకి దిగాల్సి వచ్చింది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలో దిగిన కివీస్ జట్టు.. అద్భుతంగా ఆడింది. స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్(Kane Williamson) సూపర్ సెంచరీతో అదరగొట్టాడు.కాన్వే(97)తో కలిసి 187 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News