Friday, October 18, 2024
Homeనేషనల్Delhi: అదానీ కుంభకోణంపై జేపీసీ నియమించాలి

Delhi: అదానీ కుంభకోణంపై జేపీసీ నియమించాలి

పార్లమెంటు ఆవరణలో ప్రతిపక్ష ఎంపీలతో కలిసి నిరసనలో పాల్గొన్నారు బీఆర్ఎస్ నేతలు. అదానీ ఆర్థిక కుంభకోణాలపై సమగ్ర విచారణ జరిపించాలని, ఇందుకు గాను సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని (జేపీసీ) నియమించాలంటూ టీఎంసీ, ఆప్, డీఎంకే ఎంపీలతో కలిసి బీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా పార్లమెంట్ సమావేశాలను వాకౌట్ చేసి మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. సీబీఐ,ఈడీ, ఐటీలను దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రముఖులు, నాయకులపై తప్పుడు కేసులు బనాయించడం, దాడులకు దిగడం, భయభ్రాంతులకు గురి చేయడాన్ని ఎంపీలు తీవ్రంగా ఖండించారు.

- Advertisement -

ఈ నిరసన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు, లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, ఎంపీలు సంతోష్ కుమార్, కే.ఆర్. సురేష్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ బోర్లకుంట వెంకటేష్, రంజిత్ రెడ్డిలు పాల్గొన్నారు. రానున్న 2024 ఎన్నికలలో ప్రజాక్షేత్రంలో బీజేపీకి ఘోర పరాభావం తప్పదని వీరంతా స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News