Monday, November 4, 2024
HomeతెలంగాణErrabelli: ఏవోవో మాట్లాడతారు, వాటిని నమ్మొద్దు

Errabelli: ఏవోవో మాట్లాడతారు, వాటిని నమ్మొద్దు

“ఏమీ చేతగాని వాళ్ళు, ఏమీ చేయని వాళ్ళు ఏవేవో మాట్లాడుతారు. అలాంటి వాళ్ల మాటలు నమ్మొద్దు.. ప్రీతి కుటుంబానికి సీఎం కెసీఆర్ 10 లక్షలు ప్రకటించారు. నేను కూడా రూ. 20 లక్షలు ప్రకటించాను. ఇంకా ఆ కుటుంబంలో కేటీఆర్, నేను ఒక ఉద్యోగం ఇవ్వాలని ఆలోచిస్తున్నాం. ఇలా ఎవరైనా, ఏ పార్టీ అయినా చేసిందా? ఒకసారి ఆలోచించుకోవాలి”.. అని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

- Advertisement -

జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం మొండ్రాయి సమీపంలోని చెరువు ముందు తండాలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు చేసిన మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, “కొందరు వస్తారు. ఏవేవో మాట్లాడుతారు. కానీ ఏమీ చేయరు అన్నారు. ఏమైనా చేస్తే కెసిఆర్, నేనే చేయాలి. ప్రీతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటున్నది సీఎం కెసిఆర్ మాత్రమే. చావులను కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకునే కొందరు వస్తారు. పోతారు. కానీ వారి వల్ల ప్రజలకు ఏలాంటి మేలు జరగదు. ప్రజలు పని చేస్తున్న వాళ్ళను గుర్తు పెట్టుకోవాలి” అని మంత్రి ఎర్రబెల్లి స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News