సీనియర్ నటుడు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ ‘లైలా'(Laila) ప్రీరిలీజ్ ఈవెంట్‌లో వైసీపీ నేతలను మేకలతో పోలుస్తూ కామెంట్స్ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ(YCP) అభిమానులు సోషల్ మీడియాలో లైలా సినిమాని బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తనను వేధిస్తున్న వైసీపీ సోషల్ మీడియా వింగ్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- Advertisement -
తాజాగా పృథ్వీరాజ్(Prudhvi Raj) వైసీపీ అభిమానులకు క్షమాపణలు చెప్పారు. వ్యక్తిగతంగా తనకు ఎవరి మీద ద్వేషం లేదని తెలిపారు. తన వల్ల సినిమా దెబ్బతినకూడదని అందుకే అందరికీ క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఇక ‘బాయ్ కాట్ లైలా’ కాకుండా ‘వెల్కమ్ లైలా’ అనాలని విజ్ఞప్తి చేశారు. ‘లైలా’ సినిమా పెద్ద హిట్ కావాలని ఆకాంక్షించారు.