తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్‌గా దీపాదాస్ మున్షీని అధిష్టానం తొలగించింది. ఆమెపై రాష్ట్ర నేతల నుంచి పలు ఫిర్యాదులు వెళ్లాయి. ఏకపక్షంగా ఆమె నిర్ణయాలను తీసుకుంటున్నారనే ఆరోపణలు చేశారు. దీంతో మున్షీ స్థానంలో కొత్త ఇంఛార్జ్(Congress Incharge)గా మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan)ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 1999 నుంచి 2002 వరకు NSUI అధ్యక్షురాలిగా మీనాక్షి ఉన్నారు. 2002 నుంచి 2005 వరకు మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వ్యవహరించారు. 2008లో ఏఐసీసీ కార్యదర్శిగా ఎంపికయ్యారు.
అనంతరం 2009 పార్లమెంట్ ఎన్నికల్లో మాండసోర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. 2014లో మాత్రం ఓడిపోయారు. అప్పటి నుంచి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) టీమ్‌లో కీలక సభ్యురాలిగా పనిచేస్తున్నారు. కాగా తెలంగాణతో పాటు ఒడిశా, జార్ఖండ్, బీహార్, మణిపూర్, తమిళనాడు, మధ్యప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు కూడా కొత్త ఇంఛార్జ్‌లను నియమిస్తూ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఆదేశాలు జారీ చేశారు.
