విశాఖ గోపాలపట్నంలోని వెంకటాపురంలో నవ వధువును కట్టుకున్నోడే శారీరకంగా చిత్రహింసలు పెట్టి కాటికి పంపించేలా చేశాడు. వీడు చేసే లైంగిక వేధింపులు భరించలేక ఆ మహిళ ఆత్మహత్య(suicide) చేసుకుంది. ఈ ఘటనలో విస్తుపోయే నిజాలను పోలీసులు వెల్లడించారు.
వివరాలివే
విశాఖపట్నానికి చెందిన నాగేంద్రబాబుకు గత ఏడాది 23 ఏళ్ల వసంతతో వివాహమైంది. ఇతను ఎలక్ట్రీషియన్ పని చేస్తుండేవాడు. అయితే ఇతనికి అశ్లీల వీడియోలు చూసే అలవాటు ఉంది. ఈ అలవాటు పెళ్లైనా కూడా మానుకోలేదు. పైగా తన ఫోనులో ఆ వీడియోలు చూపిస్తూ భార్యను లైంగికంగా వేధింపులు గురి చేస్తుండే వాడని వసంత తన అక్కకు చెప్పినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రతిరోజు లైంగిక బలం కోసం టాబ్లెట్లు వాడి టార్చర్ పెడుతున్నాడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఫోన్లో సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.
భర్త ఆగడాలు మితిమీరి
ఇలా భర్త ఆగడాలకు అదుపు లేకపోయింది. సంవత్సరం నుండి అసభ్యకర వీడియోలలో ఉన్నట్లు లైంగికంగా ఉండాలని నాగేంద్రబాబు వేధించేవాడు. పైగా తను అందుకు ఒప్పుకోపోయేసరికి ఆ విషయాన్ని బంధువులందరికీ నాగేంద్రబాబు ఫోన్ చేసి వసంత లైంగిక జీవితానికి పనికిరాదంటూ చెప్పడంతో మనస్థాపానికి గురైన మహిళ గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. వసంత ఆత్మహత్య చేసుకోవడంతో భర్త నాగేంద్రబాబు, అతని తండ్రి పోలీసు స్టేషను ఎదుట లొంగిపోయారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు పలు విషయాలు వెల్లడించారు.
వీడియోలపై ఆరా
అశ్లీల సైట్స్ ఫై బ్యాన్ ఉన్న వీడియోస్ ఎక్కడివి అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. భార్య వసంతను లైగింకంగా టార్చర్ చేయడానికి చూసిన వీడియోలుపై విచారణ చేయడానికి నాగేంద్రబాబు సెల్ ఫోన్ సీజ్ చేశారు పోలీసులు.
లైంగికంగా వేధించి హత్య
తమ కుమార్తెను లైంగికంగా బలవంతం చేసి హత్య చేశారని ఆరోపిస్తున్నారు వసంత తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు. నాగేంద్ర బాబుకు అతని తల్లి సహకరించే విధంగా మాట్లాడేదని వాపోతున్నారు. పోలీసులు రంగప్రవేశం చేయటంతో నాగేంద్రబాబు తల్లి, తమ్ముడు పరారయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.
నాగేంద్రకు రిమాండ్
ఈ కేసులో నాగేంద్రకు ఈ నెల 28వరకు కోర్టు రిమాండ్‌కు విధించింది. దీంతో పోలీసులు అతడిని విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. నాగేంద్ర మొబైల్ను ఓపెన్ చేసిన పోలీసులు అశ్లీల వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. గూగుల్ హిస్టరీలో అశ్లీల సైట్స్ ఓపెన్ చేసి చూసినట్లు తెలిసింది. లైంగిక సామర్ధ్యం పెంచుకునేందుకు, మందుల కోసం గూగుల్‌లో నాగేంద్ర సెర్చ్ చేసేవాడని చెప్పారు. అతని మెుబైల్ ని రికవరీ కోసం ల్యాబ్ కి పంపించామన్నారు. నాగేంద్రను తిరిగి కస్టడీలోకి తీసుకునే ఆలోచనలో ఉన్నారు పోలీసులు.