సోమవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్కి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ సాదర స్వాగతం పలికారు. అనంతరం గోవా ముఖ్యమంత్రి తిరుమలకు బయల్దేరి వెళ్ళారు. వారు సాయంత్రం ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
టెంపుల్ మేనేజ్మెంట్ కు సంబంధించి కొత్త విధానాలు, ఉత్తమ పద్ధతులు అన్వేషించడం, స్థిరమైన పర్యావరణ వ్యవస్థను ఏర్పాటుచేయడం, డిజిటలైజేషన్, ఆలయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను పెంపొందించే వ్యూహాలే లక్ష్యంగా ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో (ITCX) సదస్సు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్, కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్, ఆర్‌ఎస్ఎస్ ప్రతినిధి సీఆర్ ముకుంద్ పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆలయాల ప్రతినిధులు హాజరుకానున్నారు. 58 దేశాల్లోని సుమారు 1600 ఆలయ, ఆధ్యాత్మిక సంస్థలు ఆన్‌లైన్ ద్వారా ఎక్స్‌పోతో కనెక్ట్ కానున్నట్టు వెల్లడించారు.