Friday, September 20, 2024
Homeనేరాలు-ఘోరాలుKarimnagar: ట్రాన్స్ జెండర్ లు 'ఇనామ్' దౌర్జన్యాలు ఆపేయాలి

Karimnagar: ట్రాన్స్ జెండర్ లు ‘ఇనామ్’ దౌర్జన్యాలు ఆపేయాలి

కొంతమంది ట్రాన్స్ జెండర్ వర్గానికి చెందిన వారు పట్టణంలో ఎక్కడ శుభకార్యం జరిగినా వారి ఇంటి ముందు వాలిపోయి ఇంటి యజమానికి చుక్కలు చూపిస్తూ, దౌర్జన్యంగా వేలకు వేలు డబ్బులు గుంజుతున్న సంఘటనలు దృష్టికి వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బరాయుడు.

ఇంటిల్లిపాది సంతోషంగా చేసుకునే వేడుకలు, గృహప్రవేశాలు, పెళ్లిళ్లు, ప్రారంభోత్సవాలు ఇంకా ఏదైనా వేడుక చేసుకునే సందర్భంలో ఇంటి ముందు వేసి ఉన్న టెంట్ ను గమనించిన కొంతమంది ట్రాన్స్ జెండర్ లు, ఆ ఇంటి వద్ద వాలి పోయి, ఇంటి యజమానికి చుక్కలు చూపిస్తున్న పలు సంఘటనలు తమ దృష్టికి వస్తుడటాన్ని సీరియస్ గా తీసుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. వేడుక జరుపుకునే వారు వేలకు వేల రూపాయలు ఇచ్చేంతవరకు రకరకాలుగా వేధిస్తూ ఇంటిల్లిపాది ముందు దుర్భాషలు ఆడుతూ, దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు మళ్లీ తెలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా ఇటువంటి వేధింపులకు గురైతే బాధితులు వెంటనే డయల్ 📞100 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి వివరాలు తెలియజేసినట్లయితే, ఐదు నిమిషాలలో బాధితుల సమక్షంలోనికి దగ్గరలో వున్న బ్లూ కోల్ట్స్ సిబ్బంది, పెట్రో కార్ సిబ్బంది చేరుకొని వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News