కొత్త ఎన్నికల కమిషనర్ గా జ్ఞానేష్ కుమార్ నియమితులయ్యారు. ఈనెల 19న ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. 2029 జనవరి 26 వరకు ఆయన ఎన్నికల కమిషనర్ గా కొనసాగనున్నారు. కేరళ క్యాడర్ ఐఏఎస్ అధికారి అయిన జ్ఞానేష్ ఐఐటీలో ఇంజినీరింగ్ పూర్తిచేశారు. బిహార్, అస్సాం, కేరళ, పాండిచ్చేరి, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జ్ఞానేష్ ఆధ్వర్యంలోనే జరగబోతున్నాయి. కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షాకు ఈయన సన్నిహితుడిగా పేరుంది. అయోధ్య రామ మందిర వివాదం మొదలు ఆర్టికల్ 370 నిషేధం వరకూ పలు కీలక అంశాల్లో జ్ఞానేష్ పెద్ద పాత్ర పోషించారు.
20 అసెంబ్లీ ఎన్నికలు ఈయన ఆధ్వర్యంలో జరుగనుండగా, 2027లో జరుగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలు, 2029 లోక్ సభ ఎన్నికల సన్నాహాలు కూడా జ్ఞానేష్ ఆధ్వర్యంలో సాగనున్నాయి.