Sunday, February 23, 2025
Homeఆంధ్రప్రదేశ్Srisaialm: బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోండి: సీఎం

Srisaialm: బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోండి: సీఎం

ఈ నెల 19 నుంచి మార్చి 1 వరకు శ్రీశైలం(Srisailam) పుణ్యక్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు మొదలుకానున్నాయి. బ్రహ్మోత్సవాల కోసం దేవాలయ అధికారులు అన్ని ఏర్పాట్ల పూర్తి చేశారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu)కి ఆహ్వానం అందించారు.

- Advertisement -

శ్రీశైలం శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవాలయంలో జరిగే కార్యక్రమాలకు హజరుకావాలని ఆలయ ఈవో ఎం. శ్రీనివాసరావు, పండితులు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఆహ్వాన పత్రిక అందచేసి రావాలని కోరారు.

ఈ నెల 19వ తేదీ నుంచి మార్చి 1 వరకుశ్రీశైలం మహా క్షేత్రంలో శివరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయని సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆలయ పండితులు స్వామివారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందించి ఆశీర్వదించారు.

భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దర్శన ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. అలాగే భక్తుల సౌకర్యార్థం తీసుకోవాల్సిన భద్రతా చర్యలు క్యూలైన్లలో రద్దీ నివారణ వంటి అంశాలపై తీసుకోవాల్సిన చర్యలపై ఆలయ ఈవోకు పలు సూచనలు చేశారు.



సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News