Sunday, February 23, 2025
HomeతెలంగాణTaj Banjara: తాజ్‌ బంజారా హోటల్‌‌ సీజ్‌.. ఎందుకంటే..?

Taj Banjara: తాజ్‌ బంజారా హోటల్‌‌ సీజ్‌.. ఎందుకంటే..?

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న తాజ్‌ బంజారా(Taj Banjara) హోటల్‌‌ ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేంద్ర ప్రభుత్వ పెద్దల నుంచి క్రికెటర్లు, హీరోల వరకు హైదరాబాద్‌ వస్తే ఈ హోటల్‌లోనే బస చేస్తుంటారు. అంతేకాకుండా పెద్ద పెద్ద రాజకీయ సమావేశాలు కూడా జరుగుతుంటాయి. అలాంటి హోటల్‌ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు.

- Advertisement -

రెండేళ్లుగా ట్యాక్స్‌ చెల్లించకపోవడంతో సీజ్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. దాదాపు కోట్ల రూపాయలు ట్యాక్స్ చెల్లించాలని పేర్కొన్నారు. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా యాజమాన్యం పట్టించుకోలేదని.. అందుకే సీజ్ చేశామంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News