Saturday, April 19, 2025
Homeనేరాలు-ఘోరాలుStudents Missing: తెలుగు రాష్ట్రాల్లో 9 మంది విద్యార్థులు మిస్సింగ్

Students Missing: తెలుగు రాష్ట్రాల్లో 9 మంది విద్యార్థులు మిస్సింగ్

రెండు తెలుగు రాష్ట్రాల్లో 9 మంది విద్యార్థులు(students missing) అదృశ్యమయ్యారు. ఇందులో నలుగురు బాలురు, 5 మంది బాలికలు. వీరిలో నలుగురు హైదరాబాద్ కు చెందిన వారు. మరో 5 మంది బాలికలు కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన వారిగా గుర్తించారు. ఇంట్లో తల్లిదండ్రులు మందలించారని బాలికలు చెప్పకుండా వెళ్లిపోయారు. స్కూల్లో టీచర్లు దండించారని నలుగురు మగ పిల్లలు కనిపించకుండా పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా బాలికల ఆచూకీ లభ్యమైంది. వారిని తల్లిదండ్రులకు అప్పగించారు. మిగిలిన నలుగురు అబ్బాయిల అచూకీ కోసం వెతుకుతున్నారు.


హైదరాబాద్ అంబర్ పేట్ ప్రేమ్ నగర్ కి చెందిన నలుగురు స్టూడెంట్స్ మిస్సింగ్ అయ్యారు. పరీక్షలో కాపీ కొట్టడంతో మందలించిన టీచర్స్, పేరెంట్స్. దీంతో 8వ తరగతి చదువుతున్న తేజనాథ్ రెడ్డి, నితీష్ చౌదరి, హర్షవర్థన్, మహ్మద్ అజామ్ అలీ ఇళ్ల నుంచి పారి పోయారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా పిల్లల ఆచూకీ కోసం యత్నిస్తున్నారు. కాచీగూడ రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.

ఇంటి నుంచి పారిపోయిన 5 మంది బాలికలు
కృష్ణా జిల్లాలో ఇంటి నుండి పారిపోయిన మైనర్ బాలికలను కేవలం మూడున్నర గంటల్లోనే గుర్తించి సురక్షితంగా వారి తల్లిదండ్రులకు అప్పగించారు గన్నవరం పోలీసులు. కాలేజీకి సరిగా వెళ్లడం లేదనే కోపంతో తల్లిదండ్రులు మందలించారని, మనస్థాపానికి గురై ఇంటి నుండి పారిపోయిన ఐదుగురు మైనర్ బాలికలను గుర్తించి, సురక్షితంగా వారి తల్లిదండ్రులకు అప్పగించారు గన్నవరం పోలీసులు.

- Advertisement -

వివరాల్లోకి వెళితే
గన్నవరం మండలం ముస్తాబాద్ గ్రామానికి చెందిన సల్మాన్ ఖాన్ అనే వ్యక్తి తన కుమార్తెను కాలేజీకి గైర్హాజరయిందని మందలించి, నాలుగు రోజులుగా కాలేజీకి పంపకుండా ఇంటి దగ్గరే ఉంచారు. ఈ నెల 19వ తేదీ రాత్రి బాలిక తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసి పడుకుంది. కాలేజీకి పంపకుండా ఇంటి దగ్గరే ఉంచుతున్నారని, తీవ్ర మనస్థాపానికి గురైన ఆ మైనర్ బాలిక, మిగిలిన నలుగురు స్నేహితురాళ్లతో కలిసి తెల్లవారుజామున ఇంటి నుండి చెప్పకుండా వెళ్లిపోయింది.

తెల్లవారుజామున చూడగా తన కుమార్తె కనిపించకపోవడంతో, కంగారుపడిన తండ్రి సల్మాన్ ఖాన్ చుట్టుపక్కల బంధువులను, తన స్నేహితులను విచారించారు. పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేవలం మూడున్నర గంటల్లోనే గుర్తించి సురక్షితంగా వారి తల్లిదండ్రులకు అప్పగించారు గన్నవరం పోలీసులు.


సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News