అసెంబ్లీకి రావాలనుకుంటే పవన్ కు విజిటింగ్ పాసులిస్తామంటూ మంత్రి గుడివాడ అమరనాథ్ ఆఫర్ ఇచ్చారు. 175 స్థానాల్లో పోటీచేసే దమ్ములేని నేత పవన్‌కళ్యాణ్, 5, 10 సీట్లకోసం చంద్రబాబు వద్ద దేహీ అంటున్నాడని అమర్నాథ్ ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో గుడివాడ అమరనాథ్ మాట్లాడుతూ.. పదేళ్లలో జనసేన పార్టీ తీరును చూస్తే.. 2014లో కొంతమందితో పొత్తు, 2019లో మరికొంతమందితో పొత్తులు పెట్టుకుంటే.. ఇప్పటికే ఆయన పొత్తు పెట్టుకున్న పార్టీ గురించి ఏమని మాట్లాడారో అందరూ చూశారు. కనీసం రాజకీయ అజెండా అనేది లేకుండా, రాజకీయ పార్టీని ఎందుకు పెట్టారో కూడా తెలియకుండా పవన్‌కళ్యాణ్ పర్యటనలు చేస్తుంటాడు.
AP: పవన్ కు ఓపన్ ఆఫర్ ఇచ్చిన గుడివాడ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES