ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(AP Assembly) ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. అయితే గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ(YCP) ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలకు దిగారు. స్పీకర్ పోడియం వద్దకు వచ్చి సేవ్ డెమోక్రసీ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రతిపక్ష నేత హోదా వచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నినాదాలు చేశారు. ఆ నినాదాల మధ్యే గవర్నర్ ప్రసంగం కొనసాగించారు. ఈ క్రమంలోనే వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
- Advertisement -
ఈ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్ హాజరయ్యారు. 2024 ఎన్నికల అనంతరం కొత్త సభ్యుల ప్రమాణస్వీకారం రోజు అసెంబ్లీకి వచ్చిన జగన్.. అప్పటి నుంచి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన సంగతి తెలిసిందే. దాదాపు 8 నెలల తర్వాత మళ్లీ సభకు వచ్చారు.