Monday, February 24, 2025
HomeతెలంగాణNereducharla: సోమప్ప క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Nereducharla: సోమప్ప క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం

సోమప్ప జాతర

శ్రీ సోమప్ప సోమేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం రోజు మహా శివరాత్రి జాతర ఉత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. ఉదయం సుప్రభాత సేవ, ధ్వజారోహణం, రుద్ర హోమం నిర్వహించారు. 30 మంది పోలీస్ సిబ్బంది, 35 మంది పారిశుద్ధ్య కార్మికులు, పంచాయతీ కార్యదర్శులు జాతర కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ చిత్తనూరు సత్యనారాయణ మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు తాగునీరు, చలువ పందిర్లు, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

- Advertisement -

కార్యక్రమంలో వైస్ చైర్మన్ లొడంగి లక్ష్మయ్య, డైరెక్టర్లు పెండెం సైదులు, పగిడిమర్రి సోములు, మాలోత్ బాలామణి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొనతం చిన్న వెంకటరెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ తాళ్ల సురేష్ రెడ్డి, బెల్లంకొండ నరసింహ రావు, గ్రామ పెద్దలు రహీం, ప్రవీణ్, మండల ప్రధాన కార్యదర్శి అజయ్, కృష్ణారావు, సొందు అబ్బాసు, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News