ఏపీలోని మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు(MLC Polling) పోలింగ్ ముగిసింది. క్యూ లైన్లో ఉన్నవారికి మాత్రేమే ఓటు వేసే అవకాశం ఉంది. తర్వాత వచ్చిన వారికి అవకాశం లేదు. ఉమ్మడి కృష్ణా- గుంటూరు, ఉమ్మడి తూర్పు గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలీంగ్ ముగిసింది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ ముగిసింది.
విజయనగరం జిల్లా:
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజక వర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లాలో మధ్యాహ్నం 2 గంటల సమయానికి 78.42 శాతం పోలింగ్ నమోదు అయినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. మొత్తం 5223 ఓట్లకు గాను మధ్యాహ్నం 2 గంటలకు 4096 ఓట్లు పోల్ అయినట్లు వెల్లడించారు. పురుష ఓటర్లు 80.31 శాతం, మహిళా ఓటర్లు 75.27 శాతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు తెలిపారు.
పోలింగ్ సరళిపై లోకేశ్ భేటీ
పోలింగ్ సరళిపై అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో మంత్రి నారా లోకేష్ భేటీ అయినట్లు తెలుస్తోంది. పోలింగ్ తీరుతెన్నులు, తీసుకోవాల్సిన చర్యలపై లోకేష్ దిశానిర్దేశం చేశారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని ఇన్‍ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులకు ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నేతలకు మంత్రి నారా లోకేష్ సూచనలు చేస్తున్నారు.
MLC: ఏపీలోని 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ముగిసిన పోలింగ్
- Advertisement -
సంబంధిత వార్తలు | RELATED ARTICLES