Sunday, October 6, 2024
HomeతెలంగాణCongress Party: ప్రియాంకా చేతికి అధ్యక్ష బాధ్యతలు.. కీలక మార్పులు తప్పవా?

Congress Party: ప్రియాంకా చేతికి అధ్యక్ష బాధ్యతలు.. కీలక మార్పులు తప్పవా?

Congress Party: తెలంగాణ రాష్ట్రం తెచ్చిన పార్టీగా టీఆర్ఎస్ పార్టీకి ప్రజలలో ఎంత పాజిటివిటీ ఉందో.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు కూడా అంతే పాజిటివిటీ ఉంది. కానీ.. దాన్ని ఓట్లు మలచుకోవడంలోనే కాంగ్రెస్ విఫలమైతే.. టీఆర్ఎస్ సక్సెస్ అయింది. రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కి ఎంత అవకాశం ఉన్నా.. ఆ పార్టీ పరిస్థితి దిగజారిపోవడానికి కారణం అంతర్గత కుమ్ములాటలు. పార్టీ అధికారంలో లేకపోయినా.. అసలు అధికారంలోకి వస్తుందనే ఆశలు లేకపోయినా.. పార్టీలో పదవుల కోసం సీనియర్ నేతలు బహిరంగంగానే పోరుకి దిగుతారు.

- Advertisement -

రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత క్యాడర్ లో కొంత జోష్ పెరిగినా పార్టీలో మిగతా నేతల వైఖరితో మళ్ళీ అది మొదటికి వచ్చింది. రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా వెళ్లి అసంతృప్తిలో ఉన్న నేతలను కలిసి బుజ్జగించినా ఫలితం లేకపోయింది. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా నేతలంతా తామే చక్రం తిప్పాలని చూస్తున్నారు. ఇక.. పార్టీలో ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉన్నా వాళ్ళు యాక్టివ్ గా పనిచేసిన దాఖలాలు కూడా కనిపించడం లేదు.

ముఖ్యంగా జగ్గారెడ్డి పదవి ఉంది కానీ బాధ్యతల్ని గతంలోనే తొలగించారు. అజారుద్దీన్ పేరుకే వర్కింగ్ ప్రెసిడెంట్ కాగా ఆయన ఎప్పుడూ వర్క్ చేయలేదు. ఒకవైపు అధ్యక్షుడితో పార్టీ సీనియర్లు కలిసి రాకపోవడం.. వర్కింగ్ ప్రెసిడెంట్లు యాక్టివ్ లేకపోవడంతో పార్టీ పరిస్థితి మరింత దిగజారిపోయింది. దీంతో ప్రియాంకా గాంధీ రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. ఇకపై తెలంగాణ కాంగ్రెస్‌లో ఏదైనా తనకే రిపోర్టు చేయాలని ప్రియాంకా గాంధీ పార్టీ నేతలకు సూచించినట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే ఓ సారి ఢిల్లీలో తెలంగాణ నేతలతో భేటీ అయిన ప్రియాంకా ఇప్పుడు మరోసారి సమావేశమై పూర్తి బాధ్యతలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది. పేరుకు రేవంత్ అధ్యక్షుడిగా ఉన్నా.. అధికారాలన్నీ ప్రియాంకా చెలాయించనుంది. పార్టీ కార్యక్రమాలు.. సమావేశాలు.. కార్యాచరణ అన్నీ ప్రియాంకానే నిర్ణయించనుందట. అయితే.. అధికారాలు ఉన్నా లేకపోయినా రేవంత్ పదవిలోనే ఉండడం సీనియర్లు ఎలా చూస్తారన్నది తేలాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News