ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)లో భాగంగా ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆఫ్ఘానిస్థాన్(Afghanistan vs Australia) బ్యాటర్లు రాణించారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘాన్ జట్టు తొలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయింది. అనంతరం గత మ్యాచ్ సూపర్ స్టార్ ఇబ్రహీం జద్రాన్ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ స్కోర్‌ను ముందుకు నడిపించారు. ఈ క్రమంలో 70 పరుగుల వద్ద 22 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. సెదిఖుల్లా అటల్ (85) పరుగులతో జట్టు స్కోర్‌ను మరింతగా ముందుకు తీసుకెళ్లాడు.
ఇక ఓ దశలో 40 ఓవర్లలో 199/7 పరుగులు చేసిన ఆఫ్ఘాన్ స్కోర్ బోర్డును.. అజ్మతుల్లా ఒమర్జాయ్(67) మెరుపు ఇన్నింగ్స్ ఆడి 250 పరుగులకు పరిగెత్తించాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో డ్వారషూస్ 3 వికెట్లు, జాన్సన్, జంపా చెరో 2 వికెట్లు, ఎల్లిస్, మ్యాక్స్‌వెల్ తలో వికెట్ తీశారు.
గ్రూప్ బీ సెమీస్ బెర్త్ తేల్చే కీలక మ్యాచ్ కావడంతో ఆసక్తికరంగా మారింది. ఆఫ్ఘాన్ నిర్దేశించిన 274 పరుగుల లక్ష్యాన్ని ఆసీసీ జట్టు ఛేదించి సెమీస్ చేరుకుంటుందో.. లేదా మరోసారి సంచలన విజయం నమోదు చేసి ఆఫ్ఘాన్ జట్టు సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంటుందో కాసేపట్లో తేలిపోనుంది. ఇప్పటికే గ్రూప్ ఏ నుంచి భారత్, న్యూజిలాండ్ సెమీస్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే.