ఉత్తరాఖండ్ (Uttarakhand) ఛమోలీ జిల్లాలో మంచు కొండలు విరిగిపడిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఛమోలీ – బద్రీనాథ్ నేషనల్ హైవే రోడ్డు నిర్మాణం పనులు చేస్తున్న కార్మికులపై ఒక్కసారిగా మంచు కొండ చరియలు విరిగిపడ్డాయి.
గల్లంతైన 57 మందిలో 49 మందిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా కాపాడారు. ముగ్గురు పరిస్థితి కొంత విషమంగా ఉండటంతో ఎయిర్ లిఫ్ట్ సహాయంతో ఆసుపత్రికి తరలించారు అధికారులు.
గల్లంతైన మరో 8 మంది కార్మికుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. ఘటన జరిగిన 24 గంటల్లోనే 49 మందిని రెస్క్యూ టీమ్ రక్షించారు.
ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌లో భారీగా మంచు కురుస్తోంది. ఈ నేపథ్యంలో బద్రీనాథ్ ధామ్ హైవేపై మంచు చరియలు విరిగిపడ్డాయి. వీరంతా రోడ్డు నిర్మాణ కార్మికులుగా ఉన్నారని భావిస్తున్నారు.