పరీక్షల ఒత్తిడితో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య(suicide) చేసుకున్న ఘటన హైదరాబాద్ లో జరిగింది. చందానగర్‌కు చెందిన దీక్షిత్ రాజు(17) మియాపూర్లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు
ఈనెల 5 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ ఉండటంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకొని చనిపోయినట్లు తెలుస్తోంది. గమనించిన స్థానికులు కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు.
సంఘటన స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు తమ కొడుకుని చూసి బోరున విలపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరీక్షల సమయం కావటంతో విద్యార్థులను తమ తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని పోలీసులు తెలుపుతున్నారు.
వారి ప్రవర్తనలో ఏమాత్రం తేడా ఉన్న గమనించి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిందిగా కోరారు. ఎవరు కూడా ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలకు సన్నద్దం కావాలని సూచించారు.