నేచురల్ స్టార్ నాని(Nani) వరుస సినిమాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. హిట్3తో పాటు తనకు ‘దసరా’ వంటి బ్లాక్‌బాస్టర్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ఈ చిత్రంపై భారీ అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ మూవీ గ్లింప్స్(The Paradise Glimpse) విడుదలచేశారు. 1960 బ్యాక్ డ్రాప్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో నాని లుక్ అదిరిపోయింది. గతంలో ఎన్నడూ నటించని పాత్రలో నటిస్తున్నట్లు చూపించారు. ఇక 2026 మార్చి 26న సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ఇక భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అదిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లోఈ మూవీ విడుదల కానుంది.