Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్AP Govt: మంత్రి కాకాణి ఫైల్స్ చోరీ కేసు సీబీఐకి.. గంగలో కలిసిన జగన్ సర్కార్...

AP Govt: మంత్రి కాకాణి ఫైల్స్ చోరీ కేసు సీబీఐకి.. గంగలో కలిసిన జగన్ సర్కార్ ప్రతిష్ఠ

AP Govt: ఏపీ మంత్రి కాకాణి గోవర్ధర్ రెడ్డిపై ఉన్న ఫైళ్ల చోరీ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 13న నెల్లూరు నాలుగో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో ఓ చోరీ జరిగింది. కొన్ని కీలకమైన ఫైళ్లు మాయం కావడం అప్పట్లో కలకలం రేపింది.

- Advertisement -

ఈ దొంగతనం కేసులో పోలీసుల దర్యాప్తు సరిగా జరగడం లేదని.. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపిస్తేనే వాస్తవాలు బయటపడతాయని నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అప్పట్లో ఇచ్చిన నివేదికను సుమోటో పిల్‌గా పరిగణించి హైకోర్టు విచారణకు స్వీకరించింది. వివరాల్లోకి వెళితే.. అప్పటికి ఎమ్మెల్యేగా ఉన్న కాకాణి గోవర్థన్ తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డికి విదేశాల్లో భారీగా ఆస్తులు ఉన్నాయని.. కొన్ని పత్రాలను మీడియాకు విడుదల చేశారు. వెంటనే స్పందించిన చంద్రమోహన్ రెడ్డి కాకాణిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

ఈ క్రమంలో కాకాణి విడుదల చేసిన డాక్యుమెంట్లు ఫేక్ అని ఛార్జ్‌షీట్ ఫైల్ చేశారు. కేసు విచారణలో ఉన్న సమయంలోనే కాకాణికి జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవి దక్కింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఏప్రిల్‌లో నెల్లూరులోని కోర్టులో చోరీ జరిగింది. ఈ దొంగతనం కేసులో.. కోర్టు నుంచి కీలకమైన డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు చోరీ అయ్యాయని ఆరోపణలు వచ్చాయి. కాకాణి కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు మాయం అయ్యాయని గుర్తించడంతో ఈ వ్యవహారం అప్పట్లో సంచలనం సృష్టించింది.

ఆ కేసునే సీబీఐకి అప్పగిస్తూ ఇప్పుడు ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కాగా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైల్స్ చోరీ ఘటనపై దర్యాప్తు సీబీఐకి అప్పగిస్తే కాకాణి ఇరుక్కోవడం ఖాయమన్న చర్చ అప్పట్లోనే జోరుగా సాగింది. నెల్లూరు కోర్టులో ఉన్న ఫైల్స్ చోరీ అయ్యాయని ముందుగా ఒప్పంద బెంచ్ క్లర్క్ చేసిన ఫిర్యాదుపై అసలా ఫైల్స్ కోర్టు అధీనంలోనే లేవని, అవి పోలీస్ స్టేషన్ లో ఉన్నాయని నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని హైకోర్టుకు నివేదిక సమర్పించడం అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

గుర్తు తెలియని వ్యక్తులతో బెంచి క్లర్కు నాగేశ్వరరావు కుమ్మక్కై కట్టుకథ అల్లాడని, పత్రాలు చోరీ అయ్యాయని కోర్టును తప్పదారి పట్టించాడని ఆ నివేదికలో జస్టిస్ యామిని పేర్కొన్నారు. అంతే కాకుండా ఈ మొత్తం వ్యవహారంపై స్వతంత్ర సంస్థతో సమగ్రంగా దర్యాప్తు చేయించాలని తన నివేదికలో జస్టిస్ యామిని హైకోర్టుకు విన్నవించారు. ఆ మేరకే ఇప్పుడు హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News