రేపు(శనివారం) ప్రపంచ వ్యాప్తంగా మహిళా దినోత్సవం జరుపుకోనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కుటుంబసభ్యులు తల్లి అంజనమ్మను స్పెషల్ ఇంటర్వ్యూ(Mega Women Interview) చేశారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఫుల్ ఇంటర్వ్యూ రేపు రిలీజ్ కానుంది. ఈ ప్రోమోలో చిరంజీవి, నాగబాబు, వారి సోదరీమణులు ఉన్నారు.
- Advertisement -
ఈ సందర్భంగా తమ తల్లితో చిన్నప్పుడు ఉన్న జ్ఞాపకాలు పంచుకున్నారు. కష్ట సమయాల్లో అంజనమ్మ ఎలా సపోర్ట్‌గా నిలిచిందో చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. అయితే ఈ ఇంటర్వ్యూలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేని లోటు కనిపిస్తోంది. దీంతో పవన్ కూడా ఈ ఇంటర్వ్యూలో ఉంటే చాలా బాగుండేది అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.