Monday, March 10, 2025
HomeదైవంModhakondamma: పాడేరు శ్రీ మోదకొండమ్మ తల్లి జాతర ఎప్పుడంటే..?

Modhakondamma: పాడేరు శ్రీ మోదకొండమ్మ తల్లి జాతర ఎప్పుడంటే..?


శ్రీ మోదకొండమ్మ(Modhakondamma) తల్లిని ఉత్తరాంధ్ర గిరిజన ఆరాధ్య దేవతగా భావిస్తారు. ఆమెను పాడేరు, మాడుగులలో పూజిస్తారు. విశాఖపట్నం నుంచి 120 కిలోమీటర్ల దూరంలోని పాడేరులో స్వయంభువుగా వెలిసిన ఈ అమ్మవారు కోరిన కోర్కెలను తీర్చి సంతోషాన్ని ప్రసాదిస్తుందని ప్రతీతి. పాడేరులోని మోదకొండమ్మ జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతాయి. అమ్మవారి విగ్రహాలను తలపై పెట్టుకుని ఊరేగింపుగా మోసుకొస్తారు. ఈ ఏడాది పాడేరు శ్రీ మోదకొండమ్మ తల్లి రాష్ట్రస్థాయి జాతరను మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. మే 11, 12, 13 తేదీల్లో నిర్వహించేందుకు ఆలయ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు తెలిపారు.

మే 11, 12, 13
ఆదివారం సాయంత్రం ఉత్సవ తేదీలను అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లుకోటి బాబునాయుడు అధ్యక్షతన గ్రామ పెద్దలు, పలు సంఘాల నాయకులు, వర్తక సంఘం నేతలతో సమావేశం నిర్వహించారు. ఏడాది రాష్ట్ర స్థాయి జాతర నిర్వహించేందుకు మే 11, 12, 13 తేదీలు దివ్యమైన ముహూర్తం అని ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రమణ్య స్వామి స్పష్టం చేశారు.

- Advertisement -

గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా
దీంతో ఇదే ముహూర్తాన్ని ఆలయ కమిటీ ప్రతినిధులు గ్రామ పెద్దలు ఏకీభవించారు. ఈ ఏడాది ఉత్సవాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిసున్నట్లు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు స్పష్టం చేశారు. గతంలో కన్నా భిన్నంగా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా భారీ స్థాయిలో ఏడాది మోదకొండమ్మ తల్లి ఉత్సవాలను నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఆలయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు తెలిపారు. ఉత్సవాలకు మోదకొండమ్మ తల్లి భక్తులు, అన్ని వర్గాల ప్రజలు విరివిగా విరాళాలు ఇచ్చి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.

అన్ని రకాల ఏర్పాట్లు
త్వరలో పూర్తిస్థాయి ఉత్సవ కమిటీని వెల్లడిస్తామని అన్నారు. మోదకొండమ్మ తల్లి భక్తులు ఆయా తేదీలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని తెలిపారు. పాడేరు వచ్చే పర్యాటకులకు అమ్మవారి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.


ప్రత్యేక ఆకర్షణగా దింసా నృత్యం
పాడేరు మోదకొండమ్మ అమ్మవారి పండగ జాతరలో ఉంటుందని తెలిపారు. వివిధ సంస్కృతి సాంప్రదాయాలు తెలిపే నృత్యాలు ఎక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు. ఎక్కడా లేనివిధంగా గిరిజనులు వంటలు , గిరిజన ప్రాంతాల్లో పండే వివిధ పంటలు అమ్మవారి జాతరలో కనువిందు చేస్తాయని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News