Wednesday, April 30, 2025
Homeఫీచర్స్Pizza: పిజ్జాను ఎవరు కనిపెట్టారో తెలుసా..? ఇది ఎవరికోసం తయారు చేశారంటే..?

Pizza: పిజ్జాను ఎవరు కనిపెట్టారో తెలుసా..? ఇది ఎవరికోసం తయారు చేశారంటే..?

పిజ్జా అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. వివిధ రకాల టాపింగ్స్, చీజ్, సాస్ కలిసిన పిజ్జా తినడం ఓ సంతోషాన్నిస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన.. ఎక్కువ మంది ఇష్టపడే ఫాస్ట్ ఫుడ్స్‌లో ఒకటి. ఇటలీ దేశానికి చెందిన ఈ వంటకం తన ప్రత్యేక రుచితో మిలియన్ల మంది హృదయాలను గెలుచుకుంది. పిజ్జా చరిత్ర ఎన్నో శతాబ్దాల క్రితం ప్రారంభమైంది, ఇది అనేక మార్పులకు, అభివృద్ధికి లోనైంది. ఈ కథనంలో పిజ్జా చరిత్ర గురించి తెలుసుకుందాం.

- Advertisement -

పిజ్జా 18వ శతాబ్దంలో ఇటలీలోని నేపుల్స్‌లో కనుగొన్నారు. నిజానికి ఆ కాలంలో చాలా మంది పని కోసం ఇటలీకి.. ముఖ్యంగా నేపుల్స్ నగరానికి వలస వెళ్లేవారు. కానీ డబ్బు కొరతగా ఉండటంతో.. చాలా మందికి మంచి ఆహారం కొనడానికి కూడా డబ్బు ఉండేది కాదు. అలాగే ప్రజలు పేదల కోసం అంటే చౌకగా.. త్వరగా తయారుచేయగలిగే వంటకాన్ని తయారు చేయాలని ఆలోచించారు. ఆ కాలంలో నాపోలిలోని పేద ప్రజలు తమ ఆహారం కోసం సాదా బ్రెడ్‌పై టమోటోలు, ఆలివ్ ఆయిల్, చీజ్ వంటి పదార్థాలను వేసి కాల్చి తినడం ప్రారంభించారు. అప్పుడు రొట్టెను పాత, మిగిలిపోయిన కూరగాయలు, వెల్లుల్లి, నూనె వేసి వండగా అది పిజ్జాగా మారింది.

అయితే ఆ రోజులలో పెద్ద ఇళ్లలోని వారు పిజ్జాను తినడానికి కొంచెం కూడా ఇష్టపడరు. 1889లో, ఇటలీ యొక్క క్వీన్ మార్గరెట్టా నాపోలికి వచ్చినప్పుడు, ఒక ప్రత్యేక పిజ్జాను తయారు చేశారు. ఆ పిజ్జా ఇటలీ జాతీయ పతాకం రంగులను ప్రతిబింబించేలా.. టమోటోలతో ఎరుపు, మొజారెల్లా చీజ్‌తో తెలుపు, మరియు బాసిల్ ఆకులతో ఆకుపచ్చగా తయారు చేశారు. ఈ పిజ్జాకు మార్గరెట్టా పిజ్జా అని పేరు పెట్టారు. ఇది ఆధునిక పిజ్జాలో ఒక ప్రముఖ రకం.

20వ శతాబ్దంలో ఇటలీ వలసదారులు అమెరికాకు వచ్చినప్పుడు, వారు పిజ్జాను కూడా తీసుకువచ్చారు. మొదటి పిజ్జా షాప్ 1905లో న్యూయార్క్ సిటీలో ప్రారంభమైంది. అక్కడి నుంచి పిజ్జా ప్రాచుర్యం అంతర్జాతీయ స్థాయికి పెరిగింది. అమెరికాలో పిజ్జా వివిధ రకాలుగా అభివృద్ధి చెందింది, ముఖ్యంగా చికాగో డీప్ డిష్ పిజ్జా, న్యూయార్క్ స్టైల్ పిజ్జా విభిన్న రుచులతో ప్రాచుర్యం పొందాయి. ప్రస్తుతం పిజ్జా ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ అందుబాటులో ఉంది. వివిధ దేశాలు తమ స్థానిక రుచులకు అనుగుణంగా పిజ్జా తయారీలో సృజనాత్మక మార్పులను చేశాయి. ఉదాహరణకు, భారత్‌లో పన్నీర్ పిజ్జా, జపాన్‌లో సముద్రపు ఆహారం పిజ్జా వంటి ప్రత్యేక రకాల పిజ్జాలు ఉన్నాయి. పిజ్జా హట్ 1958లో, డొమినోస్ 1960లో ప్రారంభించారు. ఆ తర్వాత పిజ్జా క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News