తెలంగాణ రాష్ట్రంలోని హబ్సిగూడలో విషాదం జరిగింది. ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు ఆత్మహత్య (Suicide) చేసుకున్నారు. భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సంఘటన స్థలానికి వెళ్లి విచారిస్తున్న పోలీసులు!
నారాయణ కాలేజీలో గతంలో లెక్చరర్ గా పనిచేసిన మృతుడు చంద్రశేఖర్ రెడ్డి. గత ఆరు నెలలుగా ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. భార్య కవిత, కూతురు 9వ తరగతి, కుమారుడు విశ్వంత్ రెడ్డి ఐదవ తరగతి చదువుతున్నారు.
ఈ ఘటనపై ఓయూ సీఐ రాజేందర్ మాట్లాడుతూ చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుందన్నారు. హబ్సిగూడలోని రవీంద్రనగర్ కాలనీలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుందని రాత్రి 9:30కు సమాచారం వచ్చిందన్నారు.
భార్యాభర్తలిద్దరూ ఉరి వేసుకున్నారు. గతంలో ఓ ప్రైవేట్ కాలేజీలో జూనియర్ లెక్చరర్‌గా పని చేసి చంద్రశేఖర్ రెడ్డి ఉద్యోగం మానేసినట్లు సమాచారం తెలిసిందన్నారు. అంతకుముందే వాళ్ల కుమార్తె, కుమారుడికి ఉరి వేసినట్లు ప్రాథమికంగా తేలిందన్నారు. ఆర్థిక కష్టాల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారని తెలిపారు.