నెయ్యి.. సాధారణంగా దీని రుచి తెలియని వారు ఉండదు. ఆహారంలో నెయ్యిని కలిపితే టేస్ట్ మరింత పెరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. దీంట్లోని మంచి కొవ్వులు ఆరోగ్యానికి మంచివి. అయితే షుగర్ వ్యాధి ఉన్నవారు నెయ్యి తినొచ్చా చాలా మందికి ఈ సందేహం కలుగుతుంటుంది. నిజానికి డయాబెటిస్ బాధితులు నెయ్యి తింటే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. సాధారణంగా వీరు ఎప్పుడూ బ్లడ్ షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ చేసుకోవాలి. నెయ్యి గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఇది డైట్లో యాడ్ చేసుకుంటే బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పెరిగిపోదు. అంతేకాకుండా, ఇందులో గుండె ఆరోగ్యాన్ని కాపాడే హెల్తీ ఫ్యాట్స్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. రోజూ నెయ్యి తింటే షుగర్ పేషెంట్స్‌కు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకుందాం.
నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ (Butyric acid) అనే ఒక రకమైన ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ సరిగ్గా పని చేసేలా చేస్తుంది. తద్వారా శరీరంలోని కణాలు గ్లూకోజ్ (చక్కెర)ను సరిగ్గా వినియోగించుకుంటాయి. ఇన్సులిన్ పని చేయకపోతే షుగర్ వ్యాధి వస్తుంది. బ్యూట్రిక్ యాసిడ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను తగ్గిస్తుంది. అయితే, నెయ్యిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అందుకే, దీనిని తక్కువ మోతాదులో తినడం మంచిది.
షుగర్ పేషెంట్లు రోజూ ఒక చెంచా నెయ్యి తింటే చాలా మంచిదని, ముఖ్యంగా షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఎక్కువగా నెయ్యి తింటే బరువు పెరిగే అవకాశం ఉంది. బరువు పెరిగితే రక్తంలో చక్కెర స్థాయిలు మళ్లీ పెరగొచ్చు. అంతేకాకుండా, రోజూ వ్యాయామం చేయడం కూడా మంచిది. రన్నింగ్, వాకింగ్ లాంటి వ్యాయామాలు చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు మరింత బాగా నియంత్రణలో ఉంటాయి. నెయ్యిలో ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలోని హార్మోన్ల ఉత్పత్తి, నియంత్రణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇక వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్న బ్యూట్రిక్, కాంజుగేటెడ్ లినోలిక్ (CLA) యాసిడ్స్ ఉంటాయి. ఇవి శరీర కణాల్లోని వాపును తగ్గించి, ఆరోగ్యాన్ని కాపాడతాయి.
నెయ్యిలో ఉండే మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా మంచి HDL కొలెస్ట్రాల్‌ను పెంచి షుగర్ పేషంట్లలో గుండె వ్యాధుల ముప్పు తగ్గిస్తుంది. శరీరానికి ఎక్కువ సేపు శక్తిని అందిస్తుంది. డయాబెటిక్స్ రక్తంలో చక్కెర స్థాయిలు ఎప్పుడూ మారుతూ ఉండటం వల్ల తరచూ అలసటగా అనిపిస్తుంది. నెయ్యి తింటే ఆ అలసట తగ్గుతుంది.
షుగర్ వ్యాధి వల్ల డైజెస్టివ్ సిస్టమ్ ప్రభావితమవుతుంది. నెయ్యిలో ఉండే బ్యూట్రిక్ యాసిడ్ డైజెస్టివ్ సిస్టమ్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది.
దీంతో శరీరం ఆహారంలోని పోషకాలను బాగా గ్రహిస్తుంది. షుగర్ వ్యాధిని నియంత్రించడానికి పోషకాలు చాలా ముఖ్యం. షుగర్ పేషెంట్ల రక్తంలో చక్కెర ఎక్కువగా ఉంటుంది, కాబట్టి నరాలు దెబ్బతినవచ్చు. నెయ్యిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ నరాల ఆరోగ్యాన్ని కాపాడుతూ అవి దెబ్బ తినకుండా రక్షిస్తాయి. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో ఉన్న సాధారణ సమాచారం ఆధారంగా రాసినది.. దీనిని ఫాలో అయ్యే ముందు వైద్యులను సంప్రదించండి.)