అన్నమయ్య జిల్లా రాయల్పాడు సమీపంలో రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. రెండు ప్రైవేటు బస్సులు ఢీకొని ఇద్దరు మృతి చెందగా 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి గురైన క్షతగాత్రులకు మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందజేయడం జరుగుతుంది.
- Advertisement -
ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు
జిల్లాలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని రవాణా శాఖ అధికారులకు సూచించారు. ముఖ్యంగా ప్రైవేటు బస్సు ప్రమాదాలు అరికట్టే విధంగా రవాణా భద్రత చర్యలు పటిష్ఠం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు