Wednesday, March 12, 2025
Homeనేరాలు-ఘోరాలుBreaking News: చిత్తూరులో కాల్పుల కలకలం

Breaking News: చిత్తూరులో కాల్పుల కలకలం

చిత్తూరులో కాల్పుల ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఓ ప్రముఖ వ్యాపారి ఇంట్లో మరో ప్రముఖ వ్యాపారి దోపిడీకి పన్నాగం పన్నినట్లు పోలీసులు గుర్తించారు.

- Advertisement -

చిత్తూరులోని గాంధీరోడ్డులో బుధవారం ఉదయం కాల్పులు కలకలం సృష్టించాయి. లక్ష్మీ సినిమా హాల్‌ సమీపంలో ఉన్న పుష్ప కిడ్స్‌ వరల్డ్‌ యజమాని చంద్రశేఖర్‌ ఇంట్లోకి దొంగల ముఠా చొరబడింది. రెండు తుపాకులతో వారు గాల్లోకి కాల్పులు జరిపారు. యజమాని అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడికి చేరుకుని ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. తుపాకులు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో యజమాని చంద్రశేఖర్‌కు గాయాలయ్యాయి.

ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. చంద్రశేఖర్‌ ఇంట్లో దోపిడీకి ఎస్‌ఎల్‌వీ ఫర్నీచర్‌ యజమాని ముఠాను ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. కర్ణాటక, ఉత్తారాదికి చెందిన దుండగులు ఈ ముఠాలో సభ్యులుగా ఉన్నారు. రబ్బర్‌ బుల్లెట్లు వినియోగించే తుపాకులతో ఇంట్లో దోపిడీకి యత్నించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. రెండున్నర గంటల పాటు ఆపరేషన్‌ నిర్వహించారు. దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News