విశాఖలో నిర్వహించిన యువత పోరు(Yuvatha poru)లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు వైకాపా యువత నాయకులు.
పార్టీ బలవంతంగా రోడ్ల మీదకు రావాలి అని పిలుపు ఇచ్చినా గత 9 నెలలుగా విద్యా వ్యవస్థను మంత్రి నారా లోకేష్ ప్రక్షాళన చేస్తున్న తీరు చూసి కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి అంటూ వైకాపా నాయకులు మనస్సులో మాట బయట పెట్టారని టీడీపీ శ్రేణులు అనుకుంటున్నారు.
పార్టీ నిరంతరం ప్రజలతోనే..:
వైసీపీ ఎప్పుడు కూడా ప్రజలకు తోడుగా ఉంటుందని మాజీ సీఎం జగన్ అన్నారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో వారు పార్టీ ఆవిర్బావ వేడుకల్లో మాట్లాడుతూ.. ప్రజలకు పార్టీ ఎప్పుడు కూడా అండగా నిలబడుతుందన్నారు.
ప్రజల తరపున ఎప్పుడూ గొంతుకై, వారికి అండగా ఉంటుందని మరోసారి తెలియజేస్తూ.. ఈరోజు నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి, మీ అందరికి కూడా చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. అదే విధంగా పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీలో ప్రతి నాయకుడు, కార్యకర్తకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నానంటూ జగన్ క్లుప్తంగా ప్రసంగించారు.