కాకినాడ పోర్టు అక్రమాల కేసులో సీఐడీ విచారణకు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి(Vijayasai Reddy) హాజరయ్యారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ పోర్టు డీల్ వెనక మొత్తం ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి హస్తం ఉందని బాంబ్ పేల్చారు. తనపై ఆరోపణలు ఎవరు చేయించారో..ఎలా చేశారో అనేది మొత్తం తనకు అర్ధమైందని తెలిపారు. అలాగే లిక్కర్ స్కామ్‌లో సూత్రధారి, పాత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డే అని కుండబద్దలు కొట్టారు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు బయటపెడతానన్నారు.
‘‘భయం అనేది నా బ్లెడ్‌లోనే లేదు. ఎవరికీ భయపడే రకం కాదు. గతంలో నాయకుడిపై భక్తి, గౌరవం ఉండేది.. ఇప్పుడు ఆ భక్తి దేవుడి మీద ఉంది. జగన్ నాకు పదవులు ఇచ్చాడు కాదనను.. కానీ ఆ పార్టీలో అనేక అవమానాలు పడ్డాను. కోటరీ వల్లే నేను జగన్(Jagan)కు దూరమయ్యాను. జగన్ మనసులో నాకు చోటు లేదని తెలిసాకే వీడాలని నిర్ణయించుకున్నాను. కోటరీ మాటలు వినొద్దని అనేకసార్లు జగన్‌కు చెప్పాను. అయినా వినలేదు. కోటరీ నుంచి బయటకు రాకపోతే జగన్‌కు భవిష్యత్ ఉండదు. జీవితంఓ మళ్లీ వైసీపీలో చేరను ’’ అని విజయసాయి రెడ్డి వెల్లడించారు.