Saturday, March 15, 2025
Homeనేరాలు-ఘోరాలుSuicide: రైల్వే హై టెన్షన్ 25 కే.వీ వైర్లను పట్టుకొని యువకుడు ఆత్మహత్యాయత్నం

Suicide: రైల్వే హై టెన్షన్ 25 కే.వీ వైర్లను పట్టుకొని యువకుడు ఆత్మహత్యాయత్నం

ప్రకాశంజిల్లా గిద్దలూరులో ఓ యువకుడు రైల్వే హై టెన్షన్ 25 కే.వీ వైర్లను పట్టుకొని ఆత్మహత్యాయత్నం (Suicide) చేశాడు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు చనిపోయాడు. ఆత్మహత్య చేసుకున్న యువకుడు చెన్నైలోని ప్రముఖ ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ ఫోర్త్‌ ఇయర్‌ చదువుతున్న ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడు గ్రామానికి చెందిన వరికుంట్ల అమర్నాథ్‌గా రైల్వే పోలీసులు గుర్తించారు.

- Advertisement -

45 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం.. ఆత్మహత్యకు ప్రేమే కారణమా..!
అమర్నాథ్ చెన్నైలోని ఓ ప్రముఖ ఇంజనీరింగ్‌ యూనివర్సిటీలో బీటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ 45 లక్షల ప్యాకేజీని అమర్నాథ్‌కు ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. చేతికొచ్చిన బిడ్డ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

అసలు అమర్నాధ్‌ ఎందుకు ఆత్మహత్యాయత్నం చేయాల్సి వచ్చిందో అర్ధం కావడం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే అమర్నాధ్‌ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా అనుమానిస్తున్నారు. తాను ప్రేమించిన యువతితో పెళ్ళి జరగదన్న మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News