కొండ బిట్రగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు(Sri Prasanna Venkateswara Swamy Brahmotsavam) అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 6వ రోజు శుక్రవారం కమనీయంగా వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నారు.
శాసన మండలి సభ్యులు బీద రవిచంద్ర, కావలి శాసన సభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డితో కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ లాంఛనాలతో స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రములు సమర్పించిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. మంత్రికి పూర్ణకుంభంతో వేద పండితులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు.
అశేష భక్తజనంతో కలిసి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్య కల్యాణ మహోత్సవ వేడుకను భక్తిశ్రద్ధలతో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వీక్షించారు. వేల సంఖ్యలో విచ్చేసిన భక్తుల గోవింద నామస్మరణలు, వేదపండితుల మంత్రోచ్ఛారణలతో కొండ బిట్రగుంట మారుమోగుతున్నారు.