Monday, March 17, 2025
Homeఆంధ్రప్రదేశ్Chandrababu: గత ఎన్నికల్లో ఓటమిపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

Chandrababu: గత ఎన్నికల్లో ఓటమిపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

ఏపీ అసెంబ్లీ సమావేశాలు(AP Assembly) కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో సీఎం చంద్రబాబు(CM Chandrababu) మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2004, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమికి తానే కారణమని తెలిపారు. తనను ఎవరూ ఓడించలేదన్నారు. అప్పుడు తాను కొన్ని పనులు చేయకపోవడం వల్లే ఓటమి చెందామని తెలిపారు. ప్రజల కోసం పని చేస్తూ.. పార్టీని, ఎమ్మెల్యేలను సమన్వయం చేయలేకపోయాయన్నారు. ఆ పొరపాటు నుంచి ఎంతో నేర్చుకొని మళ్లీ విజయం సాధించామని వెల్లడించారు. ప్రజాసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపితేనే ప్రజలు వెంట ఉంటారని.. లేదంటే ప్రజలు మనల్ని పక్కన పెట్టేస్తారని చెప్పుకొచ్చారు. మరోసారి టీడీపీకి అలాంటి పరిస్థితి తీసుకురానని స్పష్టం చేశారు.

- Advertisement -

2047 నాటికి దేశం 30 ట్రిలియన్‌ డాలర్ల జీడీపీకి చేరాలని ఆకాంక్షించారు. అసెంబ్లీలో స్వర్ణాంధ్ర విజన్‌ -2047 డాక్యుమెంట్‌పై ఆయన మాట్లాడారు. నియోజకవర్గ విజన్‌ డాక్యుమెంట్‌ అమలుపరిచే బాధ్యత ఎమ్మెల్యేలదే అని తేల్చిచెప్పారు. 2047 కల్లా రాష్ట్ర తలసరి ఆదాయం రూ.55 లక్షలు సాధించేలా విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించామన్నారు. 2029 ఎన్నికల్లో ప్రజలకు ఏం చేస్తామో ముందే చెప్పి ఎన్నికలకు వెళ్తామని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News