మరో వారం రోజుల్లో ఐపీఎల్ 2025(IPL 2025) ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాయి. మరోవైపు అన్ని ఫ్రాంఛైజీలు తమ కెప్టెన్లను కూడా ప్రకటించాయి. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)తమ కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను సారథిగా నియమించినట్లు తెలిపింది. కేఎల్ రాహుల్ కూడా పోటీలో ఉన్నప్పటికీ కెప్టెన్సీ వైపు మొగ్గుచూపలేదు. దీంతో అక్షర్ పటేల్ వైపు యాజమాన్యం మొగ్గుచూపింది.
ఇక తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సౌతాఫ్రికా సీనియర్ బ్యాటర్ ఫాఫ్ డు ప్లెసిస్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది. మెగా వేలంలో డు ప్లెసిస్‌ను ఢిల్లీ రూ.2 కోట్లకు దక్కించుకుంది. కెప్టెన్‌గా అతడికి ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకోవాలని యాజమాన్యం భావించింది. ఐపీఎల్‌లో 2022-24 వరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
కాగా అంతకుముందు ఢిల్లీ జట్టు కెప్టెన్‌గా రిషభ్ పంత్ కొనసాగాడు. అయితే అతడు వేలానికి మొగ్గుచూపడంతో లక్నో సూపర్ జెయింట్స్ రూ.27కోట్లుకు కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో ఢిల్లీ తమ తొలి మ్యాచ్‌ను ఈనె 24న ఆడనుంది. విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో ఢిల్లీ తలడనుంది.